telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కమీషన్ల కోసమే ఇన్నాళ్లు కేసీఆర్ మౌనంగా ఉన్నారు: ఎంపీ కోమటిరెడ్డి

komati-venkat-reddy mp

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కోసమే ఇన్నాళ్లు కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక ఏడేళ్లుగా సీఎంగా ఉంటున్న కేసీఆర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

గత డిసెంబర్‌లోనే ఏపీ అసెంబ్లీలో 80వేల క్యూసెక్కుల విస్తరణ చేయనున్నట్లు జగన్ చెప్పాడని కోమటిరెడ్డి గుర్తుచేశారు. అప్పుడే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జీవోపై తాము మాట్లాడే వరకు కేసీఆర్ నోరు విప్పలేదన్నారు. కృష్ణా రివర్ బోర్డుకు ఇన్నాళ్లు లేఖ ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్‌పై తమకు నమ్మకం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Related posts