telugu navyamedia
రాజకీయ వార్తలు

కార్పొరేట్ ప‌న్ను త‌గ్గింపు నిర్ణయం పై మోదీ హర్షం

narendra-modi

కార్పొరేట్ ప‌న్నుల‌ను కుదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ప‌న్నును త‌గ్గించ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని అన్నారు. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణ‌యాన్ని మోదీ ప్ర‌శంసించారు. కార్పొరేట్ పన్నుల రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న చర్యలను స్వాగతించారు.

దీని ఫలితంగా ‘మేకిన్ ఇండియా’ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయివేటు పెట్టుబడులు రాబట్టేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. దేశీయ ప్రయివేటు రంగంలో కూడా ఆరోగ్యకరమైన పోటీతత్వం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.ఈ చ‌ర్య‌ల ద్వారా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లుగా మారుతుంద‌ని మోదీ అన్నారు. మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఇది ఊతమిస్తుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts