telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేఏ పాల్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…

కరోనా కారణంగా తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఏపీ నుండి వస్తున్న అంబులెన్స్‌ల‌తో సహా అని వాహనాలను బోర్డర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ అంబులెన్స్‌ల‌ను తెలంగాణ‌లోకి రానివ్వ‌డం లేద‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసారు కేఏ పాల్‌. పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని జ‌స్టిస్ శ్రీ‌దేవి ధ‌ర్మాస‌నం ఎదుట కేఏ పాల్ న్యాయ‌వాది ప్రస్తావించారు. తిరస్క‌రించిన‌ హైకోర్టు.. ఇప్ప‌టికే చీఫ్ జ‌స్టిస్ ఆదేశాలు జారీచేశార‌ని గుర్తుచేసిన ధ‌ర్మాస‌నం.. ఆదేశాలున్నా మ‌ళ్లీ పిటిష‌న్ ఎందుకు.. చీఫ్ జ‌స్టిస్ ధ‌ర్మాస‌నం వ‌ద్ద‌కే వెళ్లాల‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. కోర్టు ముగిసే ముందు సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రస్తావించారు కేఏ పాల్ న్యాయ‌వాది. అయితే మ‌ధ్యాహ్నం 2.30కే విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు.. మీడియాకు లీకులు ఇచ్చిన కేఏ పాల్ టీం.. అంబులెన్స్‌ల‌ను అనుమతించాల‌ని కోర్టు ఆదేశించిన‌ట్లు మీడియాను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది.

Related posts