telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పెళ్ళి చేసుకుంటానని ఎన్నారై ను మోసం చేసిన యువతి…

Shadow

ఓ మాట్రిమోనియల్ వెబ్‌సైట్లో తమిళనాడుకు చెందిన మైథిలీ వెంకటేష్ అనే యువతి నచ్చడంతో తనను పెళ్లి పప్రపోజల్ చేశాడా ఎన్నారై. దానికి ఒప్పుకున్న మైథిలీ.. తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, దానికి వైద్యం చేయించుకోవాలని చెప్పింది. ఆ శస్త్రచికిత్సకు సరిపోయేంత సొమ్ము తన దగ్గర లేదంది. దాంతో ఆమెకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాడా ఎన్నారై. ఆమె అడిగినప్పుడల్లా కొంత సొమ్ము పంపడం మొదలెట్టాడు. అలా 2017 మే నుంచి 2018 జనవరి వరకు సుమారు రూ.41 లక్షలు పంపించాడు. ఇంగ్లండ్ వస్తే ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని అడిగాడు. దానికి ఒప్పుకున్న ఆమె.. అక్కడకు వెళ్లి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. కానీ అక్కడ ఎవరినీ ఫొటోలు తీయనివ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ‘ఈమే నాక్కాబోయే భార్య’ అంటూ మైథిలీ ఫోటోను స్నేహితులకు చూపించాడా ఎన్నారై. వారిలో ఓ మిత్రుడు ఆమె మోసగత్తె అని, గతంలో కూడా ఓ ఎన్నారైని మోసం చేసి రూ.కోటిపైగా కాజేసిందని చెప్పాడు. దీంతో కంగుతిన్న అతను తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు మైథిలీ అసలు పేరు శృతి అని, ఓ రిలీజ్ కాని సినిమాలో నటించిందని చెప్పారు. గత జనవరిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ మద్రాసు హైకోర్టులో జరుగుతోంది. అయితే ఇటీవల కోర్టులో శృతి ఓ కొత్త పిటిషన్ వేసింది. సోషల్ మీడియా, ఇతర వెబ్‌సైట్లలో తనపై వస్తున్న వార్తలు, ఫొటోలు తొలగింపజేయాలని కోర్టును కోరింది. ఆమె పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు.. ఆరు వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోయంబత్తూర్ ఎస్పీకి ఆదేశాలివ్వడం గమనార్హం.

Related posts