telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ప్ర‌స్తుతం యువ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. డిఫరెంట్ సినిమాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ యువ క‌థానాయ‌కుడు న‌టిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ క్రేజీ హీరో సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. 2017 క్రిస్మ‌స్ నుండి కొంత మంది అభిమానుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌హుమ‌తుల‌ను అందిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా 2019 క్రిస్మ‌స్‌కు ఏమైనా బ‌హుమ‌తుల‌ను కోరుకోమ‌ని క‌నీసం 9-10 మందికైనా బ‌హుమ‌తుల‌ను అంద‌చేస్తాన‌ని హ్యాష్ టాగ్ దేవ‌ర‌శాంట‌గా అభిమానుల‌కు వీడియో విడుద‌ల చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. శివ శంక‌ర్ రెడ్డి అనే అభిమాని త‌న‌కు మ్యాక్ బుక్ ప్రొ కావాల‌ని రిక్వెస్ట్ పంపాడు. ఆ అభిమాని కోరిక ఈరోజు నేర‌వేరింది. విజ‌య్ దేర‌వ‌కొండ సోదరుడు..హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ స్వ‌యంగా స‌ద‌రు అభిమాని ఇంటికి వెళ్లి మ్యాక్ బుక్ ప్రొను అంద‌జేశాడు. “దేవ‌ర‌శాంటా కాంటెస్ట్‌లో బ‌హుమ‌తిని అందుకోవ‌డం ఆనందంగా ఉంది. ఆనంద్ అన్న స్వ‌యంగా మా ఇంటికి వ‌చ్చి బ‌హుమ‌తి ఇవ్వ‌డం సంతోషంగా అనిపించింది” అని బ‌హుమ‌తి అందుకున్న శివ శంక‌ర్ రెడ్డి మెసేజ్‌తో పాటు ఫోటోను ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts