telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

శుభ్ మంగల్ జ్యాదా పాండే .. లాంటి చిత్రాలు చాలా రావాలి… : ఆయుష్మాన్ ఖురానా

ayushman khurana on homosexuality movies

‘విక్కీ డోనర్’ అంగ స్థంబన సమస్య ఉన్న వ్యక్తిగా, స్పెర్మ్ దాతగా ‘శుభ్ మంగల్ పాండే’ బ్లైండ్ మ్యూజీషియన్‌గా ‘అంధధన్’ తాజాగా ఒక భావజాలపరమైన పోలీసు అధికారిగా ‘ఆర్టికల్ 15’ సినిమా్ల్లో నటించి, తన నటనా ప్రతిభను నిరూపించుకున్నాడు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ‘శుభ్ మంగల్ పాండే’కి కొనసాగింపుగా ‘శుభ్ మంగల్ జ్యాదా పాండే’ అనే సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయుష్మాన్.. స్వలింగసంపర్కుడిగా కనిపించనున్నాడు. ఆయుష్మాన్ ప్రస్తుతం ‘డ్రీమ్ గర్ల్’ ‘బాలా’ ‘గులాబ్ సితాబో’ అనే సినిమాలతో పాటుగా ‘శుభ్ మంగల్ జ్యాదా పాండే’ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ సినిమా గురించి ఆయుష్మాన్‌ను మీడియా ప్రశ్నించగా.. ”కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్‌లో ‘శుభ్ మంగల్ జ్యాదా పాండే’ సినిమా చాలా ప్రాధాన్యత కలిగింది. స్వలింగ్ సంపర్కుల హక్కుల నేపధ్యంలో కమర్షియల్ సినిమాలు తీయడం చాలా చాలా అవసరం. ”బహుశా స్వలింగ సంపర్కుల పట్ల పక్షపాతం ఉన్న వారే నేటి సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ముందు అలాంటి వారు సినిమా చూడాలి. అందరితో పాటు స్వలింగ సంపర్కులకు కూడా హక్కులు ఉంటాయనే విషయం గ్రహించాలి” అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు.

Related posts