తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాజయ్య, కడియం శ్రీహరిలను టార్గెట్ చేస్తూ… సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. “అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన గతంలోని ఉపముఖ్యమంత్రులు రాజయ్య, కడియం శ్రీహరి గార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విలువ లేకుండా చేసిన అవమానపు ప్రభావమో ఏమో… ఈ రోజు వరంగల్ టీఆరెస్ పార్టీ నాయకులు…. మొత్తం అణగారిన వర్గాల ప్రజల పైనే కామెంట్స్ చేసే స్థాయికి తెగిస్తున్నారు. “యథా ముఖ్యమంత్రి… తథా ప్రజా ప్రతినిధి”… సాక్షాత్తూ సీఎం దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా తీసి పక్కన పడేసినప్పుడు… నేను కనీసం అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులను హేళన చెయ్యకూడదా?… అని అనుకుంటునట్టుంది ఆ వరంగల్ ప్రజాప్రతినిధి తీరు.” అంటూ విజయశాంతి టీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు.
previous post
next post