telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ స్పాట్ లో విజయ్ కు ఘన స్వాగతం… అభిమానుల హడావిడి

Vijay

ప్రముఖ నటుడు దళపతి విజయ్‌ ” మాస్టర్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐటీ రైడ్స్ తర్వాత విజయ్ ఎప్పటిలానే షూటింగ్ కు హాజరయ్యాడు. తమిళనాడులోని నైవేలీ ప్రాంతంలో గనుల్లో విజయ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎక్స్ బీ ఫిలిమ్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ. ఇక సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఏప్రిల్ 9న సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఐటీ రైడ్స్ తరువాత షూటింగ్ స్పాట్ కు వచ్చిన విజయ్ కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నరు. విజయ్ డబుల్ రోల్ లో కన్పించనున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Related posts