telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవుతున్న ఎన్డీఏ సర్కార్…

pm modi

మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పంజా విసురుతున్నాయి… దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 40 వేలకు పడిపోయినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కలవరపెడుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవుతోంది ఎన్డీఏ సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.. ఈ సమాశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే, ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో కోవిడ్ పరిస్థితి, వివిధ రంగాలపై కోవిడ్‌ ప్రభావాన్ని చర్చించడంతో పాటు.. తాజాగా, కోవిడ్ వ్యాక్సిన్‌పై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సమావేశంలో వ్యాక్సిన్‌ ఎప్పుడు వచ్చేఅవకాశం ఉంది అనేదానిపై, అలాగే వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇతర కీలక అంశాలను.. ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నారు.

Related posts