దేశ ప్రజలు మొత్తం ఫ్రాన్స్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై నిరశన చేశారు. అయితే కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం దేశంలోని పోలీసుల మొఖాలన చూపుతున్న ఫొటోలను షేర్ చేయడం, సోషల్ మీడాయాలో పోస్టచేయడం చట్టరీత్యా నేరమని వారిపై చర్యలు తప్పవనీ అధికారులు తెలిపారు. దాంతో అక్కడి ప్రజలు ఆందోలనకు దిగారు. ట్రొకాడిరో వద్ద మానవహక్కుల కోసం ప్రజలు నిరసన చేశారు. అంతేకాకుండా నో టు ది పోలీస్ స్టేట్ అంటూ ప్లగ్ కార్డులను పట్టుకుని నిరసించారు. అయితే ఈ నిరసనలు కేవలం రాజధానిలోనో లేదా ఏదో ఒక రాష్ట్రంలో కాకుండా దేశమంతటా జరుగుతున్నాయిన సమాచారం. అయితే పోలీసు మొఖం కనిపిస్తున్న ఫొటోను ఎవ్వరు షేర్ చేసిన వారు సామాన్య ప్రజానికం అయిన, జర్నలిస్టులైనా ఒకటేనని అధికారులు తెలిపారు. ఒకవేల ఎవ్వరైనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారి ఫోటొను షేర్ చేస్తే వారికి సంవత్సరం జైలుతో పాటు దాదాపు 45,000 యూరోల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఇలా ఫొటోలను షేర్ చేయడం ద్వారా పోలీసు అధికారి వ్యక్తిగతానికి బంగం కలిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే దీని కారణంగా దేశంలో ఉన్న శాంతియుతమైన జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయని, పోలీసులకు ప్రజలకు మధ్య విభేదాలు వస్తాయని కొందరు నిరసనకారులు అంటున్నారు. అయితే ఈ చట్టానికి సంబంధించిన బిల్లు తన మొదటి రీడింగ్‌ను పూర్తిచేసుకుందని, ఇంకా రెండవ రీడింగ్ జరగాల్సి ఉందని అంటున్నారు.
previous post
next post