విగ్రహల ధ్వసంపై ఏపీ డీజీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా…బీజేపీపై మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని.. డీజీపీ సవాంగ్ వాస్తవాలు బయటపెడితే ఆయనను బీజేపీ, టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి విపక్షాలపై ఫైర్ అయ్యారు. డీజీపీని బెదిరించే విధంగా సోము వీర్రాజు లేఖ రాశారని… అధికారుల్ని, ప్రభుత్వాన్ని బెదిరించాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని టీడీపీ, బీజేపీ పార్టీలు రెండు చూస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్వేదిపై సీబీఐకి విచారణ అప్పగించామని… ఇప్పటి వరకు ఎందుకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించలేదని తెలిపారు. సీబీఐ కేంద్రం పరిధిలోనే ఉంది కదా.. 4 నెలలు పూర్తైంది ఇప్పటివరకు దోషులను ఎందుకు పట్టుకోలేదు..? అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. మీరు గుళ్లను కూల్చితే మేము మళ్లీ నిర్మిస్తున్నామని… గుడికో గోమాత కార్యక్రమం కన్పించడం లేదా..? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్‌ను కలుపుకున్నప్పుడే బీజేపీ పార్టీ నేతలు హిందూ మతాన్ని మంట కలిపేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు.
next post
జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి: డిప్యూటీ సీఎం అంజాద్