telugu navyamedia
రాజకీయ

ఆచార్యుడు గా ప్రధాని నరేంద్ర మోడీ ..

పరీక్షలు వస్తున్నాయంటే పిల్లల్లో ఒకరకమైన భయం , తెలియని ఆందోళన మొదలవుతాయి . కరోనా కాలంలో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం మానేశారు . ఇంటిదగ్గరే వుంది ఆన్ లైన్ లో పాఠాలు నేర్చుకుంటున్నారు . ఇప్పుడు పరీక్షల వేళ ఎలా రాస్తామో అన్న బెంగ ప్రారంభమైంది . దీనికి తోడు తల్లిదండ్రుల ఒత్తిడి కూడా పిల్లలపై ఎక్కువవయ్యింది .

పరీక్షలంటే పిల్లల్లో వున్న భయాన్ని పోగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రోజు “పరీక్ష పే చర్చ ” కార్యక్రమాన్ని నిర్వహించారు . న్యూ ఢిల్లీలోని తల్కతోరా స్టేడియం లో విద్యార్థులతో అపూర్వమైన కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు . ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి 12. 12 లక్షలమంది విద్యార్థులు , 2,71 లక్షలమంది ఉపాధ్యాయులు , 90,000 మంది తల్లితండ్రులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు .

Parents should not put pressure on children to fulfill their dreams: PM Modi

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రత్యక్షంగా , పరోక్షంగా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు .పిల్లల్లో వున్న అనేక భయాలను , అనుమానాలను , అపోహలను ప్రధాని పోగొట్టి ధైర్యాన్ని నింపారు .పిల్లల విషయంలో తల్లితండ్రులు తమ ఆశలు, ఆకాంక్షలు రుద్దవద్దని , వారిని స్వేచ్ఛగా వదిలిపెట్ట్టామని ప్రధాని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు మొత్తానికి ఆచార్యుగా కూడా ప్రధాని తనదైన ముద్రను విద్యార్థులపై వేశారు

Related posts