telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరోజినీ నాయుడు బయోపిక్ ఫస్ట్ లుక్

Sarojini

ప్ర‌ముఖ స్వాతంత్య్ర‌ స‌మ‌రయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా స‌రోజిని నాయుడు జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతుంది. ఇందులో స‌రోజ‌ని దేవిగా రామానంద్ సాగ‌ర్ నిర్మించిన “రామాయ‌ణ్”‌లో సీత పాత్ర పోషించిన దీపికా చిఖలియా న‌టిస్తుంది. తాజాగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా, ఇందులో దీపికా ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఆకాష్‌ నాయక్, ధీరజ్‌ మిశ్రా ద్వయం ‘స‌రోజిని’ అనే టైటిత్‌తో తెర‌కెక్కుతున్న‌ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని రాయల్‌ ఫిల్మ్‌ మీడియా సమర్పణలో కాను భాయ్‌ పటేల్‌ నిర్మించనున్నారు. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన‌ ఫ‌స్ట్ లుక్ ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది. ఓ స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధురాలిపై పెద్ద‌ చిత్రం రూపొంద‌నుండ‌డం ఇదే మొద‌టిసారి.

 

View this post on Instagram

 

#sarojini#sarojininaudu …..1st look #poster……#starplus #ramayan #730 #everyday

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

Related posts