telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన బిగ్ బాస్ షో 4 ఫేం అరియాన…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి మరియు బిగ్ బాస్4 షో సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ నటి, బిగ్ బాస్ షో 4 ఫేం అరియాన గ్లోరీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనం రోజు రోజుకు తగ్గిపోతుందని దానిని పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ రోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ జబర్దస్త్, శివ జ్యోతి యాంకర్, గీతా మాధురి గాయని లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Related posts