telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తారకరత్న బర్త్ డే సందర్బంగా సారథి నుండి పోస్టర్ రిలీజ్…

నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో తారకరత్న ఒక్కడు. అయితే మొదట్లో మంచి సినిమాలు తీసిన తారకరత్న తర్వాత వైఫల్యాల కారణంగా కొంత కలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు. అయితే ప్రస్తుతం తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టైటిల్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈరోజు తారకరత్న పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ని విడుద‌ల‌చేసింది చిత్ర‌యూనిట్‌. అయితే ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేన‌ర్ లోగోకి, `సార‌థి` టైటిల్‌కి మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. అయితే కరోనా సమయంలో కూడా నంద‌మూరి తారక రత్న అలాగే ఈ చిత్రబృందం ఎంతో సాహసంతో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసింది. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూస‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ద‌గ్గ‌ర‌నుండి మంచి స‌పోర్ట్ ల‌భిస్తోంది. ఇక త్వ‌ర‌లో ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుంది చిత్రబృందం. అయితే ఈ సినిమాలో తారకరత్న ఓ కోచ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది.. అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి మరి.

Related posts