telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడే మోడీతో .. కేసీఆర్ భేటీ .. రేపు జగన్ వంతు..

kcr special pooja in kaleswaram

నేడు కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్టు నిర్మించడానికి సహకారం అందించాలని ప్రధానిని కోరనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా కోరనున్నారు. మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను కుదించడంతో ఆర్థిక సహకారం అందించాలని కూడా విజ్ఞప్తి చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ నేడు కేసీఆర్‌కు, శనివారం జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. జగన్ వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాల అమలుతోపాటు రివర్స్ టెండరింగ్ గోదావరి జలాలు శ్రీశైలానికి మళ్లింపుపై రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు, పీపీఏల గురించి వివరణ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.

కరెంట్ కొరత దృష్ట్యా అదనపు బొగ్గు కోసం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో కేంద్రం ఇచ్చే రూ. 6,500లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6వేలు కలిపి మొత్తం రూ. 12,500 రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించారు. కేంద్రం నిధులు కూడా ఇందులో ఉండడంతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Related posts