telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పొద్దున్నే తాటికల్లు తాగేసిన తెలంగాణ మంత్రులు !

ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రులు ఎక్కువగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలో, లేక కేటీఆర్‌ ను ప్రసన్నం చేసుకోవడానికో కానీ… మొత్తానికి ప్రజా క్షేత్రంలో బాగా కనిపిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటూ… అధినేత నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ప్రజల్లో కనిపిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను తిప్పికొడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రులు ఏకంగా కల్లు మండవాలో ప్రత్యక్షమయ్యారు. రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే మార్గ మధ్యంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికులు సమస్యలను తెలుకోని సాంప్రదాయ తాటికల్లును పొద్దున్నే మంత్రులు సేవించి తమ సంతోషాన్ని గీత కార్మికులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు.

Related posts