telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ నెల 27న ఈడీ ఆఫీసుకు నేనే హాజరవుతా : శరద్ పవార్

Loksabha Elections MP Contest Sharad pawar

మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు(ఎంఎస్‌సీబీ)లో రూ. 25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఆయన్న అన్న కుమారుడు అజిత్ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి అక్రమ కేసులు పెడుతారని ముందే ఊహించనని శరద్ పవార్ తెలిపారు. అయితే ఈ కేసులో తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీకి చెప్పేందుకే తానే స్వయంగా ఈ నెల 27వ తేదీన ఈడీ ఆఫీసుకు వెళ్తానని శరద్ పవార్ ప్రకటించారు.తాను ఏ బ్యాంకు లావాదేవీల్లో పాలుపంచుకోలేదని తెలిపారు. తనకు భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఈ కేసులో ఏ క్షణమైనా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

Related posts