telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మహానంద నదిలో .. పడవ మునిగిన ఘటనలో ఏడుగురు మృతి .. 50మంది గల్లంతు..

7 died in boat sink in west bengal

పశ్చిమబెంగాల్ లో పడవ మునిగిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలోని మాల్దా జిల్లా చంచల్ గ్రామం వద్ద మహానంద నదిలో ఈ ఘటనజరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 50 మంది గల్లంతు అయ్యారు. చంచల్ గ్రామం సమీపంలోని నదిలో గురువారం సాయంత్రం పడవ మునిగింది. పంచమి సందర్భంగా ముకుందాపూర్ ఘాట్ లో జరిగిన పడవ పోటీలను తిలకించి గ్రామస్థులు పడవలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పడవ నీటిలో మునిగిపోవడంతో పడవలో ఉన్నవారు చెల్లాచెదురయ్యారు. గజఈతగాళ్లు మహానంద నదిలో నుంచి ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఇంకా గుర్తించలేదు. పశ్చిమబెంగాల్, బీహర్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.

మహానందపూర్ గ్రామ పంచాయతీకి చెందిన 70 మంది పడవ పోటీలు చూసి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో వరదనీరు అధికంగా ప్రవహించడంతో పాటు పడవలో కెపాసిటీ కంటే అధికంగా ప్రజలను ఎక్కించుకున్నారని స్థానిక గ్రామ పంచాయతీ ప్రధాన్ అఖ్తరుల్ ఇస్లాం చెప్పారు. ఏడుగురి మృతదేహాలు వెలికితీశామని, మరో 50 మంది గల్లంతు అయ్యారని, మృతదేహాల కోసం తాము గజఈతగాళ్లతో గాలిస్తున్నామని స్థానిక చంచల్ ఎమ్మెల్మే ఇక్బాల్ చెప్పారు.

Related posts