telugu navyamedia
వార్తలు

ఓటరు నమోదు, ఎన్నికల ఏర్పాట్ల పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన

ఓటరు నమోదు ఎన్నికల ఏర్పాట్ల పై కేంద్ర ఎన్నికల సంఘం న్యూ ఢిల్లీ నుండి ఇద్దరు అధికారులు పరిశీలన చేశారు.
బుధవారం నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్ట్రోల్ అధికారి కార్యాలయంలో న్యూ ఢిల్లీ నుండి ఈసిఐ అండర్ సెక్రటరీ, అజయ్ కుమార్, సెక్షన్ అధికారి సందీప్ కుమార్ లు కలిసి ఈ ఆర్ ఓ కార్యాలయానికి వెళ్లి పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు, జెండర్ రేషియో, ఈ పి రేషియో అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా 92,227 రెండు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సెకండ్ యస్ యస్ అర్ లో బాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో క్లేమ్స్, అబ్జెక్షన్, మార్పులు చేర్పులు, ఓటరు నమోదు పై స్వీప్ కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ చేపట్టిన చర్యల గురించి ఈ ఆర్ ఓ వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ ఈ ఆర్ ఓ ఆంజనేయులు, ఆర్ ఓ లావణ్య. ఎ ఇ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts