telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

*వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు చేస్తాం – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీస్, హెచ్ఎండిఏ, ఆర్ అండ్ బి, మెట్రో, జలమండలి, హెల్త్, అగ్నిమాపక శాఖ, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై సమన్వయ సమావేశం బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది.

ముందుగా జిహెచ్ఎంసి కమిషనర్ మాట్లాడుతూ… వినాయక చవితి పండుగ సందర్భంగా నగర వాసులు కన్నుల పండుగ జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా మేటర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… వినాయక చవితి పండుగ ఉత్సవాల సందర్భంగా నగరంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సూచించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెచ్ఎండిఏ ద్వారా స్టాటిస్టిక్స్ మొబైల్ క్రేన్లు గత ఏడాది కంటే అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లపై బారీకేడ్, శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్స్, మొబైల్ ట్రీ కటింగ్, ప్రూనింగ్, ఆరోగ్య శిబిరాలు, బోట్స్, స్విమ్మర్ లు, నిరంతరంగా విద్యుత్తు సరఫరా, వీధి లైట్స్, పాట్ హాల్స్, రోడ్డు మరమ్మత్తులు, అగ్ని మాపక యంత్రాలు, త్రాగు నీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు మేయర్ తెలిపారు.

డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… జిహెచ్ఎంసి వివిధ శాఖల సమన్వయంతో వ్యవహరించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఊరేగింపు సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు ట్రాఫిక్ కు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

*హెచ్ఎండిఏ:* నిమజ్జనం సందర్భంగా హెచ్ఎండిఏ ద్వారా టాంక్ బాండ్, ఎన్.టి.ఆర్ మార్గ్ లో 7ప్లాట్ ఫారం లు, టాంక్ బండ్ వద్ద 14 ప్లాట్ ఫారం లు, పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, బుద్ద భవన్ వైపు 7 ప్లాట్ ఫారం లు హెలిప్యాడ్, సంజీవయ్య పార్కు వద్ద గల బేబీ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా ఒక లక్ష మట్టి గణేష్ విగ్రహాలను 20 ప్రదేశాలలో ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

*జలమండలి:* డ్రైనేజీ శుభ్రం, మ్యాన్ హాల్స్ మరమ్మత్తులు, తాగునీరు సరఫరా, అవసరమైన వాటర్ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు, 162 సెక్షన్, 122 లొకేషన్ లో ఏర్పాటు. నిమజ్జనం సందర్భంగా ర్యాలీ సందర్భంగా కూడా వాహన ట్యాంకుల ద్వారా నీటి వసతి. అక్కడక్కడ జరగుతున్న డ్రైనేజీ మరమ్మత్తుల పనులు వేగవంతంగా పూర్తి.

*వైద్య ఆరోగ్య శాఖ:*

హైదరాబాద్ జిల్లాలో ప్రధాన కూడళ్లో వైద్య శిబిరాల ఏర్పాటు అవసరమైన మందులతో పాటు అంబులెన్స్ ప్రవేట్ హాస్పిటల్ సమన్వయంతో అత్యవసర చికిత్స అందించడం, అదే విధంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. జిల్లా కలెక్టర్ లు ఏర్పాటు కు చర్యలు. ఆరోగ్య వైద్య శిబిరాల వద్ద టెంటు ఏర్పాటు కు జోనల్ కమిషనర్ ల కు ఆదేశాలు.

*అగ్నిమాపక శాఖ:*

6 డివిజన్ పరిధిలో 79 ప్రదేశాలలో అగ్నిమాపక యాత్రలు ఏర్పాటు, కంట్రోల్ రూం వద్ద ఏర్పాటు,

*ఆర్ అండ్ బి శాఖ*

నిమజ్జనం ప్రదేశాలు, ర్యాలీ ప్రధాన ప్రదేశాలలో బారీకేడింగ్ ఏర్పాటు

*విద్యుత్ శాఖ*

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫారం మరిన్ని ఎక్కువ ఏర్పాటు. విద్యుత్ లైన్ గుండా చెట్ల కొమ్మలు కట్ చేసి వెంటనే తొలగింపు చేయుట.

*జిహెచ్ఎంసి శానిటేషన్:*

10,500 శానిటేషన్ కార్మికులు మూడు షిఫ్ట్ లుగా ఏర్పాటు, నిమజ్జనం సందర్భంగా గౌర ప్రదంగా విగ్రహాలు తొలగింపు
నిమజ్జనం నీటి నుండి తీసేసిన ఉగ్రహాలను రోడ్డు మీద పడకుండా సక్రమంగా తరలింపు. మొబైల్, పబ్లిక్ టాయిలెట్ ఎప్పటి కప్పుడు పరిశుభ్రత
విగ్రహ ఊరేగింపు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి వినిగొచుకునే విధంగా జోనల్ కమిషనర్ లు చర్యలు
గణేష్ మండపాలు, ఊరేగింపు సందర్భంగా పటిష్టమైన శానిటేషన్ చర్యలు.

*ఇంజానీరింగ్ మేయింటానెన్స్:*

గణేష్ నిమజ్జనం కొరకు నగరంలో మొత్తం 74 నిమజ్జనం కొలనులను ఏర్పాటు, 24 ప్రదేశాలలో పోర్టబుల్ నిమజ్జన బేబీ పాండ్స్,
27 బేబీ పాండ్స్, 23 ఎక్సలేటర్ ఏర్పాటు.

*మట్టి విగ్రహాల పంపిణీ*

జిహెచ్ఎంసి పరిధిలో 3.10 లక్షల మట్టి విగ్రహాలు కార్పొరేట్ ల ద్వారా ఉచితంగా పంపిణీ.

*బోట్స్/ స్విమ్మర్*

డీ.ఆర్.ఎఫ్ 453 సిబ్బంది కాకుండా 33 చెరువులు 100 మంది గజా ఈత గాళ్ల ఏర్పాటు.

*వీధి దీపాలు*

నిమజ్జనం, మండపాలు, ఊరేగింపు సందర్భంగా ఎల్ ఈ డి బల్బులు ఏర్పాటు.

*రోడ్ల మరమ్మత్తులు*

పాట్ హాల్స్, రోడ్డు మరమ్మత్తులు జోన్ లెవెల్ లో పూర్తి చేయాలి. ప్రధాన రోడ్డు (సి.ఆర్.ఎం.పి) కాకుండా ఇతర రోడ్లు కూడా మరమ్మత్తులు, పాట్ హాల్స్ పోలీస్ శాఖ గుర్తించిన మేరకు చర్యలు.
బాలాపూర్ గణేష్ విగ్రహ ఊరేగింపు సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో రోడ్లు మరమ్మత్తులు, మిగితా మున్సిపాలిటీలలో రోడ్డు మరమ్మతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.

*భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సూచనలు*

* స్వచ్ఛంద సంస్థలు అన్న ప్రసాదం సందర్భంగా ఉచిత నీటి సరఫరా

* డ్రైనేజీ శుభ్రంగా ఉంచాలి.

* ప్రధాన రోడ్ల పై ఊరేగింపు ఇబ్బంది లేకుండా మరమ్మత్తులు పనులు పూర్తిచేయాలి.

* మండపం దగ్గర పూజ సామాగ్రి వెంటవెంటనే తొలగించాలి. తొలగించిన వ్యర్ధాలు వెంటనే తరలించాలి.

* క్రేన్ డ్రైవర్స్ 3 షిఫ్ట్ లలో పనిచేయాలి. డీజిల్ సిద్దంగా ఉండాలి.

* నిమజ్జనం చేసిన విగ్రహాలను గౌర ప్రదంగా తొలగించాలి. అక్కడ నుండి తరలించే సందర్భంగా పార్ట్ లు అక్కడక్కడ పడేయకుండా సక్రమంగా తీసుకొని పోవాలి.

* ప్రతి ఇంటికి మట్టి గణేష్ విగ్రహాలను ఇవ్వాలి.

* విగ్రహ ఊరేగింపు దారిలో ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్లు వినియోగించుకునేందుకు అవకాశం. దాంతో పాటు బ్యానర్ కూడా ఏర్పాటు.

*జిహెచ్ఎంసి ద్వారా విద్యుత్ వైర్లకు తగిలే చెట్ల కొమ్మలు తొలగింపుకు అవసరమైన నిచ్చెన లు ఏర్పాటు. అదే విధంగ వీధి దీపాల ఏర్పాటు కూడా చర్యలు తీసుకోవాలి.

* ఊరేగింపు సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా, వాటర్ ట్రాలీ ఏర్పాటు.

* హిందువుల పండుగ సందర్భంగా ఎండోమెంట్ శాఖ మంత్రి గారు, సెక్రెటరీ హాజరు కావాలి.

* గణేష్ ప్రతిష్ట కోసం నిర్దిష్టమైన తేదీ ప్రభుత్వం ప్రకటించాలి.

* సర్కిల్ స్థాయిలో పోలీస్, జిహెచ్ఎంసి అధికారులు, కమిటీ సభ్యులతో సమన్వయ కోసం వాట్సప్ గ్రూప్ ఏర్పాటు.

* మల్కాజగిరి చెరువులో నిమజ్జనం వరకు నీరు ఉండే విధంగ చర్యలు, ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలి.

* బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి. దూల్ పేట్ లో కూడా రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి.

ఈ సమావేశంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఉన్నతాదిధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు, వివిధ డివిజన్ల నుండి వచ్చిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————–

*- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.*

Related posts