telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సికింద్రాబాద్ జోన్ లో వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలను పరిశీలించిన-కమిషనర్ రోనాల్డ్ రోస్

నగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ జోన్ లో పలు వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నీరు నిలిచిన ప్రదేశాలలో నిలిచిన నీరు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నీరు నిలిచిన ప్రదేశం లో మట్టి, మ్యాన్ హోల్స్ వద్ద చెత్త తొలగించాలని సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అంతకు ముందు జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. కురిసిన వర్షాలకు జోన్ లో వాటర్ లాగిన్ పాయింట్ వద్ద నీరు ఇంకా తొలగింపు చేయని వాటిని జోనల్ కమిషనర్ల ద్వారా తెలుసుకుని వెంటనే నీటి తొలగింపు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మయూర్ మార్గ్ అల్లం తోట బావి, ద్వారక దాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, ఎస్.పి రోడ్డు పెట్రోల్ పంప్, అల్లా గడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జి, లాలా పేట్, సత్య నగర్ లలో పర్యటించి మ్యాన్ హోల్స్, వాటర్ లాగిన్ ప్రాంతాలు, నాలాల ను పరిశీలించారు.

కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

—————————————————–

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts