ప్రధాని మోదీ తన అసమర్థతను కప్పిపుచ్చువకోడానికి కొత్త చట్టాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత తెలంగాణ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్లు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ గిరిజన వ్యతిరేకి అని ముద్ర వేయాలన్నారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని విమర్శించారు. రాష్ట్రప్రతి ఎన్నిక, నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్‌కి.. కేసీఆర్ ఆమోదం తెలిపారని ప్రజలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ తలుచుకుంటే ఎంఐఎం నేత అసదుద్దీన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా.. మోదీ ప్రభుత్వం రాజకీయాలు: మమత