ప్రస్తుతం సినీ పరిశ్రమలో డ్రగ్స్ హల్ చల్ నడుస్తుంది. బాలీవుడ్ కమెడియన్ భార్తి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాలను డ్రగ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిని గంజాయి తీసుకుంటున్నారన్న కేసులో అరెస్ట్ చేశారు. దీనిపై మహరాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. ఆయన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోను ప్రశ్నించారు. సినీ తారలను అరెస్ట్ చేసి డ్రగ్ ట్రాఫికర్స్‌కి రక్షణ, పబ్లిసిటీ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకునేవారి రీమాబిలిటేషన్ సెంటర్‌కు పంపాలని, జైలుకు కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నేత అన్నారు. ‘ఎవ్వరైతే డ్రగ్స్ తీసుకుంటారో వారు దానికి బానిసలవుతారు. వారిని రీహీబిలిటేషన్ సింటర్‌కు పంపాలి. జైలుకి పంపిత ఏం లాభం. అయినా ఎన్‌సీబీ డ్రగ్స్ అమ్మేవారిని పట్టుకోవాలి, డ్రగ్స్ తీసుకునేవారిని కాదు. అంతేకాకుండా సినీ పరిశ్రమను టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేస్తుంది. వీరు బాధితులను వదిలి డ్రగ్స్ అమ్ముతున్నవారిని అదుపులోకి తీసుకోవాలని, కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేద’ని ఆయన అన్నారు. భార్తీ సింగ్, ఆమె భర్తపై గంజాయి తీసుకున్నందుకు గాను చార్జెస్ వేశామని ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే తెలిపారు. అయితే ఇటీవల ఎన్‌సీబీ ఖార్ దండా ప్రాతంలో రైడ్‌లు చేసిందని, అక్కడ 21 సంవత్సరాల డ్రగ్ ట్రాఫికర్‌ను పట్టుకున్నట్లు తెలిపింది. అతడి వద్ద 15 బాటిళ్ల ఎల్‌సీడీ, 40 గ్రాముల గంజాయి, నిట్రాజెపం వంటివి దొరికాయని తెలిపారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుతో మొదలైన డ్రగ్స్ కేసు ఇంతకింతగా పెరుతుంది. ఇటీవల నటుడు అర్జుణ్ రాంపాల్ ఇంటిలో కూడా ఎన్‌సీబీ తనిఖీలు చేసింది. ఆ తరువాత రాంపాల్‌ను, అతడి గర్ల్ ఫ్రెండ్‌ను పిలిచి ప్రశ్నించింది.
previous post