telugu navyamedia
రాజకీయ వార్తలు

“మహా” రాజకీయాల పై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్రంలో గవర్నర్ అన్ని పార్టీలకు పభుత్వం ఏర్పాటుకు గడువిచ్చినా సాధ్యం కాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనల మధ్య మాటల వర్షం కురుస్తుంది. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాలు, క్రికెట్ ఒక్కలాంటివే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక్కోసారి మన ఊహకు అందక పోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు.

క్రికెట్ మ్యాచ్ లో ఒక్కోసారి ఓటమి అంచుల వరకు వెళ్లిన జట్టు అనూహ్యంగా గెలుపు చేజిక్కించుకుంటుంది. అప్పటి వరకు ఇక గెలిచేసినట్టే అనుకున్న జట్టు అనూహ్య ఓటమితో తేరుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది. రాజకీయం అంతే’ అంటూ నర్మగర్భంగా అన్నారు. ప్రస్తుతం నేనైతే ఢిల్లీ వ్యవహారాలతో బిజీగా ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం ఉండదని, అవి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారం చేపట్టినా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

Related posts