telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కదు: మంత్రి ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామనిధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో చేయని పనులన్నీ ఈ 5 సంవత్సరాలలో చేసి చూపించామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే దైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజలంతా టీఆరెస్ వైపే ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Related posts