telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ డైరక్టర్..

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్.గులేరియా గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని… “భారత్ బయోటెక్”, “సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా” కొత్త ప్లాంట్లు పెడుతున్నాయన్నారు. జులై-ఆగస్టు నాటికి భారీ సంఖ్యలో డోసులు అందుబాటులో ఉంటాయని..వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారని పేర్కొన్నారు. విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నామని.. ”కోవిషీల్డ్”, “కోవాక్సిన్”, “స్పుత్నిక్-వి” వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలో చాలా ప్లాంట్లలో జరుగుతుందన్నారు. “స్పుత్నిక్-వి” దేశంలోని అనేక సంస్థలతో తయారీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. కాగా దేశంలో గడచిన 24 గంటలలో 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 3,890 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,53,299 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907 కాగా..ఇందులో 2,04,32,898 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 36,73,802 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,66,207 నమోదైంది.

Related posts