telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యాక్సినేషన్ లో మహారాష్ట్ర కొత్త ప్లాన్…

uddhav-thackeray-shivasena

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో మన దేశ వ్యాప్తంగా 4 లక్షల కేసులకు పైగా నమోదవుతున్నాయి. కానీ అందులో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదైన రాష్ట్రం మ‌హారాష్ట్ర‌.  మ‌హారాష్ట్ర‌లో కేసుల‌ను కంట్రోల్ చేసేందుకు ఒక‌వైపు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తూనే, వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.  అయితే, ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సిన్ కొర‌త అధికంగా ఉన్న‌ది.  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 18 నుంచి 44 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తుల‌కు వ్యాక్సిన్ అందిస్తున్నారు.   అయితే, 18 ఏళ్ల నుంచి కాకుండా వ్యాక్సిన్ కొర‌త లేకుండా ఉండేంత వ‌ర‌కు 3 నుంచి 44 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన వారికి వ్యాక్సిన్ అందించాల‌ని చూస్తోంది.  ఫ‌లితంగా మ‌రికొంత మందికి వేగంగా వ్యాక్సిన్ అందుతుంద‌ని కేసుల సంఖ్య‌ను వీలైనంతగా త‌గ్గించ వ‌చ్చ‌ని మ‌హా స‌ర్కార్ భావిస్తోంది.  దీనిపై సర్కార్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. చూడాలి మరి దీని పై మనరాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తుంది అనేది.

Related posts