telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా హర్షం: కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన అత్యాచార ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఇందులో విచారణ జరుగుతున్న తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.

అందుకే హైదరాబాద్ ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి నేరాల విచారణపై ప్రజలు ఎందుకు నమ్మకాన్ని కోల్పోయారో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ చెప్పారు. నేరాల విచారణ వ్యవస్థలో మార్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Related posts