telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌…

ప్రస్తుతం తెలుగు సినీ జోరు మీద ఉన్నాయి. ఏదో ఒక సినిమా నుండి రోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇక తాజాగా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా నటిస్తున్న‌ ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌ చేసారు చిత్రబృందం. అయితే యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతని కొత్త సినిమా ‘డల్లాస్ లో దేశి దొంగలు’ పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. క్రైమ్ కామెడీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సాయికిరణ్ దైద దర్శకత్వం వహించబోతున్నాడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, కళాహి మీడియా బ్యానర్ పై కోన వెంకట్, యశ్వంత్ దగ్గుమాటి దీనిని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఆదివారం తమ చిత్రం కథానాయకుడు సిద్ధు పుట్టినరోజు సందర్భంగా మూవీని ప్రకటించడంతో పాటు టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్ మే నెలలో మొదలు కానుంది. పూర్తిగా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ చేయబోతున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు అనిరుథ్ గట్టు సినిమాటోగ్రఫర్. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందా… లేదా అనేది.

Related posts