telugu navyamedia
రాజకీయ

మహా మలుపు..మ‌హారాష్ర్ట అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష‌..

*శివ‌సేన పిటీష‌న్‌పై వాదన‌లు పూర్తి..
*మ‌హారాష్ర్ట అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష‌..
*గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించిన సుప్రీంకోర్టు
*ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు..

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రేపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోష్యారి ఆదేశించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వతా ఉత్కంఠ నెలకొంది

రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్ధించింది. శివసేన వేసిన పిటీషన్ ను తోసి పుచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు జరగబోయే విశ్వాస పరీక్షకు సంబంధించి శివసేన వేసిన పిటీషన్ పై వాదనలు జరిగాయి. దాదాపు మూడున్నర గంటల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు నిచ్చింది.

అంతకుముందు సుప్రీంకోర్టులో శివనసేన తరపున సింఘ్వీ, షిండే తరపున నీరత్ కృష్ణ కౌల్ ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు.

అసెంబ్లీలో బలపరీక్షను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి, బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని షిండే తరఫు న్యాయవాది కౌల్ వాదించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు.

బలపరీక్ష గురించి తమకు ఈరోజే సమాచారం అందిందని, బలనిరూపణకు ఒకరోజు మాత్రమే ఇవ్వడం అన్యాయమని సింఘ్వీ కోర్టుకు వాదన వినిపించారు.  తమ ఎమ్మెల్యేలు ఇద్దరికి కరోనా సోకిందని, మరికొందరు విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు.

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు బలపరీక్ష జరిగిన సందర్భంలో ఓటు హక్కు ఉండకుండా చూడాలని కూడా సింఘ్వి కోరారు. బలపరీక్ష జరపకపోతే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని సింఘ్వి వాదించారు.

 

Related posts