telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లం

ajay-kallam-

ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉన్నతాధికారుల బదిలీలు, నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా శాఖల అధికారుల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. తాజాగా జగన్ ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అజయ్ కల్లంకు కేబినెట్ హోదా కల్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులుగా వ్యవహరించే వారందరికీ.. అజయ్ కల్లం అధిపతిగా వ్యవహరిస్తారు.

అజయ్ కల్లం ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం, ఆంధ్ర ప్రదేశ్ కు కొద్దికాలం పాటు సీఎస్‌గా పని చేశారు. 2017 మార్చి 31న పదవీ విరమణ పొందారు. గతంలో ఈయన టీటీడీ ఈవోగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్‌గా, ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Related posts