telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత మహిళా క్రికెటర్లకు వ్యాక్సినేషన్ పూర్తి…

భారత మహిళా క్రికెటర్లు తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేయించుకున్నారు. ఇక సెకండ్ డోస్‌ను పురుషల క్రికెట్లతో సహా ఇంగ్లండ్‌లోనే వేయించుకోనున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు తమ సొంత నగరాల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగా.. వేయించుకోని వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ‘మహిళా క్రికెటర్లందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇందులో చాలా మంది తమ సొంతనగరాల్లోనే వ్యాక్సీన్ తీసుకున్నారు. వేయించుకోని వారికి గురువారం వ్యాక్సిన్ ఇచ్చాం’అని పేర్కొన్నారు. ఈ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫొటోను మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ట్వీట్ చేసింది. సూదంటే భయమని, కానీ ఈ రోజు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అయిపోయిందని, వీలైనంత త్వరగా ప్రజలంతా వేయించుకోవాలని ట్వీట్ చేసింది. ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత మహిళల జట్టు జూన్‌ 16 నుంచి ఏకైక టెస్టులో తలపడనుంది. ఆ తర్వాత రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడతుంది. పురుష క్రికెటర్లతోనే ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టనుంది.

Related posts