telugu navyamedia
రాజకీయ

అమరవీరుడు కెప్టెన్​ వరుణ్​ సింగ్ కు ఘ‌న నివాళి..

ఇటీవ‌ల‌ తమిళనాడు నీలగరి జిల్లాలో జ‌రిగిన‌ ఆర్మీ హెలికాప్టర్​ ప్ర‌మాదంలో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులతో పాటు 13 మంది అక్కడికక్కడే మరణించారు.

80 శాతం తీవ్ర కాలిన గాయాల‌తో బయటపడిన వరుణ్​ సింగ్​కు తొలుత వెల్లింగ్టన్​ ఆర్మీ ఆస్పత్రిలో, ఆ తర్వాత బెంగళూరు మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 8 రోజులు మృత్యువుతో పోరాడి ఈ నెల 15న కన్నుమూశారు.

భోపాల్​ విమానాశ్రయంలో.. ఆయన మృతదేహం ముందు పుష్పాంజలి ఘటించారు ఐఏఎఫ్​ అధికారులు, రాష్ట్ర మంత్రులు. వరుణ్​ సింగ్​ సేవలను స్మరించుకున్నారు. అనంతరం.. పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామానికి మధ్యప్రదేశ్​కు తరలించారు. వరుణ్​ భౌతిక కాయం చూడ‌గానే కుటుంబ సభ్యులు రోద‌న‌లు మిన్నంటాయి.

Group Captain Varun Singh's Body To Be Flown To Bhopal On Thursday

అంత‌కుముందు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ భారత వాయుసేన సహా పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు.

కాగా.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ కుటుంబానికి మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్ రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ సహా సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు చౌహాన్​ స్పష్టం చేశారు.

Related posts