సమస్య వచ్చినప్పుడు ప్రజలకు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు పేర్కొన్నారు. పవన్ వెళితే సమస్య తీరుతుందని నమ్మకం జనాలకు ఏర్పడిందని నాగబాబు అన్నారు ఉత్తరాంధ్రలో సమస్య వస్తే పవన్ అవసరం లేదు. జనసైనికులు వస్తే చాలని భావించేంతలా నమ్మకం ఏర్పడిందని అన్నారు.
గతంతో పోలిస్తే ఉత్తరాంధ్ర కార్యకర్తలు చాలా మోటివేట్ అయ్యారని, పనిచేయని నాయకులను ప్రశ్నించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. మంగళగిరిలో నాగబాబు మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికుల పోరాట ప్రతిమ అమోఘమన్నారు. వైజాగ్ రుషికొండ వ్యూ చాలా అద్భుతమైందని, దాన్ని కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేన కార్యకర్తలేనని గుర్తు చేశారు.
వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా తయారైందని, అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడని ఆరోపించారు. ఈ పాటికే ఒక కొండ తీనేసి ఉండుంటాడు. స్వార్ధం, కన్నింగ్ మైండ్, లంచగొండి తనం లేని వ్యక్తి పవన్ కల్యాణ్, పవన్ చెప్పింది వింటే 2024లో సీఎంగా చూసుకోవచ్చని చెప్పారు.