telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. పెట్టుబడులకు అనుకూలం.. ఆరోగ్యం విషయంలో జాగర్తలు అవసరం..

today rasi falalu

మేష రాశి : ఈ రోజు ఉద్యోగం విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.

వృషభం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

మిథునం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు/ బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురి కావడం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహం : ఈరోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

కన్య : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

తుల : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయాల్సి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

వృశ్చికం : ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావడం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

ధనుస్సు : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలువటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మకరం : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

కుంభం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

మీనం : ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపర్చుకోవటానికి అనుకూలదినం. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపోహలు తొలిగి పోతాయి. వ్యాహారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. కొత్త పెట్టుబడులు పెడుతారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. నివాస స్థలంలో మార్పు ఉంటుంది.

Related posts