telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..

cm jagan

సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన కు కార్యాచరణ రూపొందించింది ఏపీ ప్రభుత్వం. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల దుర్వినియోగం జరగ్గకుండా చర్యలకు సిద్ధమైంది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను నియంత్రించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్సల ఖర్చుల రీ-ఇంబర్స్మెంట్ దరఖాస్తులను స్వీకరించొద్దని ప్రజా ప్రతినిధులకు సీఎం కార్యాలయం సూచనలు చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2434 జబ్బులకు చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేసారు సీఎంఆర్ఎఫ్ ఇంచార్జి డాక్టర్ హరికృష్ణ. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ తరహా క్లెయిములను సీఎం సహాయ నిధి కింద స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు అర్ధమయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు సీఎంఓ. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని సీఎంఆర్ఎఫ్ క్లైముల దరఖాస్తులను ప్రజా ప్రతినిధుల పీఏలతో మాత్రమే పంపాలని కోరారు సీఎంఓ.

Related posts