telugu navyamedia
రాజకీయ

జర్మనీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ప్రవాస భారతీయులు పాదాభివందనం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు యూరప్‌లో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్ ఎయిర్ పోర్టులో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. 

Image

ప్రధాని మోదీని కలిసేందుకు బెర్లిన్ సహా జర్మనీలోని పలు ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు పిల్లాపాపలతో వచ్చారు. వందేమాత‌రం, భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వారిలో కొందరు మోదీకి పాదాభివందనాలు చేశారు.

Image

భారత సంతతి మహిళలతో ప్రత్యేకంగా ముచ్చటించిన మోదీ వారి యోగక్షేమాలు ఆరాతీశారు. చిన్ని పిల్లలను ముద్దుచేస్తూ కుశల ప్రశ్నలు అడిగారు మోదీ.

Image

ఓ బాలిక ప్ర‌ధానికి చిత్ర‌ప‌టాన్ని బ‌హూక‌రించింది. ప్ర‌ధాని త‌నకు ఆద‌ర్శ‌మ‌ని తెలిపింది. మరో చిన్నారి మోదీకి దేభ‌క్తి పాట‌ను పాడి వినిపించాడు.

మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్ర‌ధాని మోదీ చిటిక‌లు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడ్ని మోదీ మెచ్చుకున్నారు.

తన జర్మనీ పర్యటనలో భాగంగా నేడు బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షాల్జ్‌తో భేటీ కానున్న మోదీ కానున్నారు. జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌లో ప్రధాని మోదీ 3 రోజుల టూర్లో భాగంగా పలు కీలక భేటీలలో పాల్గొంటారు.

యూరప్ దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతుండటం, మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

Related posts