*మహారాష్ర్ట సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా
*బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా..
*ఎమ్మెల్సీ పదవికి కూడా ఉద్ధవ్ రాజీనామా
*సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం..
*మా ప్రభుత్వం పతనం వెనుక బీజేపీ ఉంది..
*సరిహద్దులను చైనా ఆక్రమిస్తుంటే..కేంద్రం మహారాష్ర్టపై దృష్టిపెట్టింది..
*శివసేనను ఎవరూ తాకలేరు
మహారాష్ర్ట సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు ఠాక్రే.
ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్.. బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చామని అన్నారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు.
మా ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలింది. ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. ఔరంగాబాద్ పేరును మార్చామని అన్నారు.
తనవాళ్లు అనుకున్న వారే తనకు నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.రెబల్ ఎమ్మెల్యేలకు ఏది కావాలో అది ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆటో రిక్షా, చేనేత బండి నడిపే వారిని ఎంపీలుగా చేశామని అన్నారు. తాను గవర్నర్‌కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని.. అయితే రెండున్నరేళ్లుగా ఆయన దగ్గర కొన్ని జాబితా పెండింగ్‌లో ఉందని అన్నారు. తిరుగుబాటు చేసిన వారందరినీ.. మీరు ఎవరితో కలత చెందుతున్నారని నేను వారిని అడగాలనుకుంటున్నానని అన్నారు
ఏక్‌నాథ్ శిందే వైపు మెజార్టీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో ఉద్ధవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సీఎం పదవికి ఠాక్రే రాజీనామాతో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
చంద్రబాబుకు అభివృద్ధి గురించి ఏం తెలుసు: మంత్రి బొత్స