telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్‌ : గత ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతి సదుపాయం రద్దు

ఏపీ సచివాలయ ఉద్యోగులకు  ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసింది. రాజధానిని అమరావతికి తరలించిన సమయంలో ఉద్యోగులకు వసతికి ఇబ్బంది అవుతుందని అప్పటి ప్రభుత్వం ఉచిత వసతి ఏర్పాటు చేసింది.

ఈ సౌకర్యాన్ని రద్దు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లను రేపటిలోగా ఖాళీ చేయ్యాల‌ని ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్‌లను అప్పగించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాగే అప్పగించాలని… ఏమైనా నష్టం జరిగి ఉంటే సంబంధిత ఉద్యోగులే భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ వ్య‌వ‌హారంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో విషయం సీఎం జగన్ దాకా వెళ్లింది. దీనిపై స‌మాచారం అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఉద్యోగులకు ప్రస్తుతం వున్న ఉచిత వ‌స‌తిని మ‌రో రెండు నెల‌ల పాటు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

కాగా..స‌మైక్యాంద్ర విభ‌జ‌న తరువాత అమరావతికి ఏపీ రాజధాని తరలించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులను వెంటనే అమరావతికి తరలించటం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సచివాలయం..శాఖల ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులకు కొంత కాలం వసతి కల్పిస్తామని ముందుకొచ్చారు. వారి కోసం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వసతి కల్పించారు. ప్రభుత్వమే వారి వసతి ఖర్చు భరిస్తూ వచ్చింది.

 

Related posts