telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సమయంలో నేను, నా భార్య సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం : నాగబాబు

Nagababu

ఇటీవలే మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కావడంతో త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అయితే నాగబాబుకి నిహారిక అంటే పంచ ప్రాణాలు. ఇంట్లోనే కాదు బయటకు వచ్చిన సందర్భాల్లోనూ.. సినిమా, టీవీ షోలలోనూ కూతురిపై ఉన్న ఇష్టాన్ని పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక నిహారిక కూడా నాన్న కూచి. తన తండ్రి తరువాతే ఎవరైనా.. నాన్న లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను.. నా బెస్ట్ ఫ్రెండ్ నాన్న అంటూ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. అయితే త్వరలో తన కూతురు నిహారికి పెళ్లి చేసి అత్తింటికి పంపుతున్న నాగబాబు చాలా ఎమోషన్ అయ్యారు. జీ తెలుగులో బాబూ బొమ్మకు పెళ్లంట అనే కార్యక్రమాన్ని ఆగష్టు 23న ప్రసారం చేస్తుండగా.. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. దాదాపు ఎనిమిది నిమిషాలు పాటు ఉన్న ఈ ప్రోమో చాలా హార్ట్ టచ్చింగ్ సాగింది. ముఖ్యంగా చివర్లో నాగబాబు తన కూతురు నిహారికను ఉద్దేశించి మాట్లాడిన మాటలు భావోద్వేగానికి గురిచేశాయి. అందరి కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కూతురు కడుపులోనే చనిపోయిన విషయాన్ని చెప్పి భావోద్వేగానికి గురికాగా.. నాగబాబు సైతం చిన్నప్పుడు నిహారిక తప్పిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను.. వాడెవడో నాలాగే నల్ల కోటు వేసుకోవడంతో వాడినే నాన్న అనుకుని వాడితో వెళ్లిపోయింది నిహారిక. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయింది నిహారిక. నాకు బుర్ర పనిచేయలేదు. ఎలా అనిపించింది అంటే.. మొత్తం న్యూజిలాండ్‌లో ఉన్న వాళ్లందర్నీ చంపేద్దాం అనుకున్నా.. వరుణ్‌ని ఇంటికి పంపించేసి.. నేను పద్మ సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాం. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా వేస్ట్ అన్నంత పిచ్చ వచ్చేసింది. పుణ్యం చేసుకుంటే వాడి కడుపున ఏంజెల్స్ పుడతారని అంటారు.. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు నాగబాబు.

Related posts