telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూజాహెగ్డేకు సమంత కౌంటర్

Pooja-and-Sam

పూజా త‌న ఇన్‌స్టాగ్రాములో స‌మంత అందంపై నెగెటివ్ కామెంట్ చేయ‌గా, అభిమానులు ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే స్పందించిన పూజా… త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింద‌ని చెప్పింది. పూజా మాట‌ల‌ని పూర్తిగా న‌మ్మ‌ని ఫ్యాన్స్ స‌మంత‌కి సారీ చెప్పాల‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ దీనిపై పూజా హెగ్డే స్పందించ‌లేదు. దీంతో పూజా హెగ్డే, స‌మంత మ‌ధ్య చెల‌రేగిన వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. అయితే పూజా పోస్ట్‌ని సెల‌బ్రిటీలు కూడా త‌ప్పు ప‌ట్టారు. తాజాగా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మంచి మ‌న‌సులు క‌లిగిన వారిని ఎదుటి వ్య‌క్తులు తెలివిత‌క్కువ వారిగా చూస్తారు’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పూజా హెగ్డేని ఉద్దేశించే స‌మంత‌ పెట్టింద‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు.

Related posts