telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సినిమా వలన అప్పులపాలయ్యా

srinivas-reddy

హాస్యనటు శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాను దర్శకత్వం తో పాటు నిర్మాత కూడా శ్రీనివాసరెడ్డినే. తాను ఎంతో ఇష్టపడి ఓ కథ అనుకుని దాన్ని మంచిగా డెవలప్ చేసుకుని స్క్రిప్ట్‌ను రాసుకుని నిర్మిస్తే ఆ సినిమా సరిగా ఆడక అప్పులుపాలైయానని చెప్పుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ స్క్రిప్ట్ ను నేను ఎంతో ఇష్టపడి రాసుకున్నాను. అయితే ఆ సినిమా ఫలితం నన్ను చాలా నిరాశ పరిచింది. నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నానని పేర్కోన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. ఆ సినిమాపై కొన్ని విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయని చెప్పాడు.

Related posts