telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సామ్ జామ్” ఫస్ట్ ఎపిసోడ్ టీజర్

Sam-Jam

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. ‘సామ్‌జామ్‌’ పేరుతో ‘ఆహా’ ఓటీటీలో రానున్న ఈ టాక్‌షోకు సామ్ ప్ర‌యోక్త‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఈ నెల 13న ప్రసారం కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించినా ఫస్ట్ ఎపిసోడ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా కన్పించారు. ఇక సమంత, హర్ష చెముడు వ్యాఖ్యాతలుగా కన్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రభాస్ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts