ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ . డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద సక్సెస్‌ఫుల్ దూసుకుపోతుంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు.
ఈ మూవీ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు తన పోస్ట్ చేస్తూ రివ్యూ చెప్పారు. అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ను తెగ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు.
“పుష్ప’గా అల్లు అర్జున్ స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్.. స్టెల్లర్ యాక్టింగ్. సుకుమార్.. తన సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రాక్‌స్టార్.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
‘పుష్ప’ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్” అంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. దీంతో సూపర్ స్టార్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
పవన్ పేరును వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు… : అడివిశేష్