telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్-3 : సిగ్గులేనోడా… నా భార్యనే అంటావా ?… మహేష్ పై వరుణ్ ఫైర్

Bigg-Boss-3

బిగ్‌బాస్-3 తొలిరోజు నుంచే హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తుంది బిగ్‌బాస్ సీజన్ 3. గురువారం హీరో వరుణ్ సందేశ్, ఫన్ బకెట్ మహేష్ మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇంతకీ గొడవ ఎలా మొదలైందంటే.. వరుణ్ సందేశ్ భార్య వితిక బ్యాటరీ మార్చుకునేందుకు ఆ రూమ్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో మహేష్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ మహేష్ తనతో అమర్యాదగా మాట్లాడాడని వితిక గొడవ మొదలుపెట్టింది. ఇంతలో వరుణ్ సందేశ్ అక్కడికి రావడంతో విషయం అతనితో చెప్పింది. అంతకుముందు కూడా ఇలాగే అమర్యాదగా మాట్లాడాడని వరుణ్‌తో చెప్పింది. దీంతో నా భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ మహేష్‌పై వరుణ్ విరుచుకుపడ్డాడు. మహేష్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించాడు. వరుణ్ తీరుతో మహేష్ కూడా ఫైర్ అయ్యాడు. ఏంటి వేలు చూపిస్తున్నావ్.. కొడుతావా? అంటూ పైపైకి వెళ్లాడు. రాహుల్ సిప్లిగంజ్ మహేష్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. అతనిపై కూడా తీవ్రంగా మండిపడ్డాడు.దీంతో ‘ఆడవాళ్లతో మాట్లాడటం నేర్చుకో.. సిగ్గులేనోడా’ అంటూ వరుణ్ ఫైర్ అయ్యాడు. గురువారం ఎపిసోడ్‌లో వీరిద్దరి గొడవే ఎక్కువగా హైలైట్ అయింది. దీంతో శుక్రవారం ఎపిసోడ్‌లోనూ ఇదే గొడవ కొనసాగుతుందా..? మహేష్-వరుణ్ మధ్య మళ్లీ గొడవలు జరుగుతాయా..? లేక అంతా సద్దమణిగినట్టేనా అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts