telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ ను వేచి చూసేలా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ…

Prabhas

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. అయితే బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. దీని తరువాత మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టాడు. వాటిలో మహానటి ఫేమ్ నాగశ్విన్ సినిమా కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకుణె నటించనుంది. కానీ కొన్న కారణాల కారణంగా ఆమె ఈ సినిమాకు ఆలస్యంగా చేరనుంది. అయితే నిజానికి దీపికా ఈ ఏడాది సగం నుంచి ప్రభాస్, నాగశ్విన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ హిందీలో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాకి కూడా అవే డేట్స్ ఇవ్వడంతో ప్రభాస్ సినిమాకు ఆలస్యంగా చేరనుంది. అయితే హృతిక్ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కనుంది. ఈ విషయంలో నాగశ్వన్ దీపికను ఈ ఏడాది చివరికి డేట్స్ ఇవ్వమని కోరాడు. అందుకు దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కథలోని పాత్రలో దీపికా పదుకొణే చేయడం చూడాలని తనకు చాలా ఆసక్తిగా ఉందని నాగశ్విన్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అయితే నాగశ్విన్ తరువాత ప్రబాస్‌తో సినిమాను ప్రకటించిన ప్రశాంత్. రేపటి నుంచి తన సినిమా సలార్ చిత్రీకరణ మొదలు చేయనున్నాడట. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది.

Related posts