telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి సరసన అనుష్క…!

Anushka

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తమిళంలో ఎంత బిజీనో అందరికీ తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా రాణిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వేరే భాషలలో తేదీలు సర్దుబాటు చేసుకుని సినిమాలు చేయడం కష్టమైన పనే. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతోన్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇక బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో ‘లాల్‌సింగ్ చ‌ద్దా’ సినిమాలోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ విల‌క్ష‌ణ న‌టుడితో డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని న‌టింప చేయ‌డానికి చ్చ‌ర‌లు జ‌రుపుతున్నార‌ట‌. గ‌తంలో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం నాన్న‌లో అనుష్క కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే ప‌రిచ‌యంతో అనుష్క ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకుంటుంద‌ని డైరెక్ట‌ర్ విజ‌య్ న‌మ్మంతో ఉన్నార‌నే టాక్ విన్పిస్తోంది‌.

Related posts