telugu navyamedia
సినిమా వార్తలు

లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి…!

Lakshmi's-Veeragrandham

టాలీవుడ్ లో దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా మూడు చిత్రాలు పోటాపోటీగా తెరకెక్కుతున్నాయి. ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో “ఎన్టీఆర్ బయోపిక్”, మరోవైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”, ఇంకోవైపు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో “లక్ష్మీస్ వీరగ్రంథం” చిత్రాలు రూపొందుతున్నాయి. ఇటీవలే “లక్ష్మీస్ వీరగ్రంథం” నుంచి కొత్త టీజర్ ను విడుదల చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాను దర్శకత్వంలో వహిస్తున్న “లక్ష్మీస్ వీరగ్రంథం” సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి నటించనుందని వెల్లడించాడు. ఇటీవలే ఈ విషయమై శ్రీరెడ్డిని సంప్రదించానని, లక్ష్మీపార్వతి పాత్రకు శ్రీరెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. కానీ ఆమెకు ఇంకా కథ చెప్పలేదని, చెప్పిన తరువాత ఆమెకి ఏదైనా అభ్యంతరం ఉంటే అప్పుడు ఆలోచిస్తానని, ప్రస్తుతానికి శ్రీరెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టడం, తరువాత ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు మొదలైన విషయాలపై సినిమా ఉంటుందని కేతిరెడ్డి వెల్లడించారు.

Related posts