telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దుమ్మురేపుతున్న “యాత్ర” ట్రైలర్

yatra movie on feb 28

జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పేద‌ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని నేరుగా విన‌టానికి మొదలుపెట్టిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌న్ని తీసుకుని “యాత్ర”  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ “యాత్ర”. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో నటిస్తున్న “ఆశ్రిత వేముగంటి” ఫస్టులుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ లో “మాటిచ్చేముందు ఆలోచిస్తాను… ఇచ్చాక ఆలోచించేదేముంది… ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సర్, గుండె జబ్బు కాదయ్యా… పేదరికం..” అంటూ చెప్పే డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ లో నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆయన లుక్ కు మంచి స్పందన లభించింది. ఇంకా రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Related posts